TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

జీఎస్‌ఎల్‌వి-F04 ఉపగ్రహ వాహకనౌక

The Typologically Different Question Answering Dataset

జీఎస్‌ఎల్‌వి–F04 ఉపగ్రహ వాహకనౌక, భూసమస్థితి ఉపగ్రహ వాహకనౌక (GSLV) శ్రేణిలో నిర్మించిన 5వ ఉపగ్రహ ప్రయోగవాహకం. ఈ GSLV) శ్రేణి ఉపగ్రహ వాహకాల ద్వారా 2 టన్నులకు మించి బరువు ఉన్న ఉపగ్రహాలను భూసమస్థితి కక్ష్యల్లో లేదా భుస్థిరకక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చును. అంతకు ముందు ఇలాంటి ఉపగ్రహాలను దక్షిణ అమెరికాలోని గయానా అంతరిక్షప్రయోగ కేంద్రంనుండి ఏరియన్ స్పేస్ వారి సహాయంతో ప్రయోగించెవారు. ఇస్రో రూపొందించిన PSLV వాహక నౌకల ద్వారా 2 టన్నుల బరువువరకు ఉపగ్రహాలను కనిష్ఠ భూకక్ష్యలో (LEO) ప్రవేశపెట్టగలిగేవారు. స్వదేశీయంగా ఉపగ్రహాలను భూ సమస్థితి/భూఅనువర్తిత కక్ష్యలో ఉపగ్రహాలను అంతరిక్షములో ప్రవేశపెట్టుటకు PSLV పనికిరావు. అందుచే భూ సమస్థితి/భూఅనువర్తిత కక్ష్యలో ఉపగ్రహాలను అంతరిక్షములో ప్రవేశపెట్టు అంతరిక్షవాహన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకొని GSLVశ్రేణి ఉపగ్రహవాహకల నిర్మాణాన్నిచేపట్టారు. ఈ క్రమంలో తయారుచేసిన 5 వ GSLV ఉపగ్రహ వాహకం జీఎస్‌ఎల్‌వి–F04. ఈ ఉపగ్రహ వాహకనౌక, ఇన్శాట్ వరుస శ్రేణికి చెందిన ఇన్శాట్-4CR ఉపగ్రహాన్ని (2130 కిలోలు), భూసమస్థితి బదిలీ కక్ష్యలో (OTC), 21. 7 డిగ్రీల వాలుతో, 170 కిలోమీటర్ల పెరిజీ (భూమికి దగ్గరిబిందువు), 35, 975 అపొజీ (భూమికి దూరపుబిందువు) తో అంతరిక్షములో 2 వతేదీ, సెప్టెంబరు, 2007న కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టినది[1][2]. ఉపగ్రహానికి ఉన్న స్వంత చోదక ఇంజను సంహాయంతో ఉపగ్రహాన్ని నిర్దేశితకక్ష్యలో స్థిరపరచారు. 

జీఎస్‌ఎల్‌వి-F04 ఉపగ్రహ వాహకనౌకని అంతరిక్షములోకి ఎప్పుడు ప్రవేశపెట్టారు?

  • Ground Truth Answers: 2 వతేదీ, సెప్టెంబరు, 20072 వతేదీ, సెప్టెంబరు, 20072 వతేదీ, సెప్టెంబరు, 2007

  • Prediction: